telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సైబర్ నేరాలకు గురైన మహిళలు కుంగిపోతున్నారు: హోం మంత్రి సుచరిత

sucharith home minister

సైబర్ నేరాలకు గురైన మహిళలు మానసికంగా కుంగిపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. సైబర్ నేరాల నుంచి మహిళలకు రక్షణ అనే అంశంపై సచివాలయంలో నిర్వహించిన సదస్సులో మంత్రి సుచరితతో పాటు మంత్రులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన మహిళలు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని మహిళలందరికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.సాంకేతికతతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అంతే అనర్థాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు రాకుండానే న్యాయం జరిగేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల కోసం “సైబర్ మిత్ర”పేరిట ఫేస్ బుక్ పేజీ, “వాట్సప్” నంబర్లు ఏర్పాటు చేశారు. “వాట్సప్”లో ఫిర్యాదు చేసేందుకు 9121211100 నంబర్ ను కేటాయించారు.

Related posts