telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ధరణి పోర్టల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములకు కూడా రక్షణ…

మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం పొగుల్లపల్లిలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సత్యవతిరాథోడ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులంతా సంతోషం గా ఉండాలని సీఎం కేసిఆర్ ధాన్యం కళ్ళాల దగ్గరే కొనుగోలు కేంద్రాలు పెట్టి సేకరిస్తున్నారు అని తెలిపారు. మక్కలు వద్దన్నా వేశారు…అయినా రైతు నష్టపోవద్దని మక్కలు కూడా కొనుగోలు చేస్తున్నాం అని పేరొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములకు కూడా రక్షణ కల్పిస్తూ… స్థానిక గిరిజనులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని సూచించారు. అలాగే పోడు భూములను కూడా సమగ్రంగా సర్వే చేయించి… స్వయంగా తానే వచ్చి పొడుభుముల పట్టా ఇస్తానని సీఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు అని సూచించారు. కానీ కొంతమంది.. గిరిజనుల భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. దయచేసి వారిని నమ్మవద్దు అని తెలిపారు. అలాగే సన్నరకం వడ్లకు కూడా మద్దతు ధరను పెంచి ఇస్తామని సీఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు అని పేర్కొన్నారు.

Related posts