హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నిన్న కూకట్ పల్లిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే… ఈ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. బాచుపల్లిలో తన మెడికల్ కళాశాలకు వెళుతుండగా ఫోరం మాల్ దగ్గర బిజెపి కార్యకర్తలు తన కాన్వాయ్ పై దాడి చేశారని తెలిపారు. బిజెపి ప్రస్టేషన్ తో తనపై దాడికి దిగిందని.. కమలం పువ్వు నేతలకు చెబుతున్న కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను వెర్రపువ్వుని కాదని ఫైర్ అయ్యారు. తనపై దాడి చేసిన సమయంలో బిజెపి కార్యకర్తలు దాడికి దిగి కారుపై ఎక్కిన కారు తనది కాదని….తన కాన్వాయ్ లు అన్నీ ఫార్చునర్ లేనని పేర్కొన్నారు. బిజెపి కార్యకర్తలు తనను చంపడానికి ప్రయత్నించారని….బిజెపి తనపై చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ సమర్ధిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. తానూ కమ్యూనిస్టు బిడ్డనే… ఇటువంటి దాడులకు బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నారాయణ లాంటి సీనియర్ నేత పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడటం సరికాదని చురకలు అంటించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని… గ్రేటర్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.
previous post
next post