telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

స్కిల్ సెన్సస్ సర్వే నిర్వహణపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు.

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన సర్వే మొక్కుబడిగా కాకుండా అర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

స్కిల్ సెన్సస్ సర్వే నిర్వహణపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్షించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ సెన్సస్ లో భాగంగా యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, స్కిల్ ప్రొఫెల్స్ ను క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారు చేస్తుందని అన్నారు.

ఈ ప్రొఫెల్స్ ను ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామని చెప్పారు. తద్వారా ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తాము  అన్నారు.

ఎడ్యుకేషన్, స్కిల్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఇదే సమయంలో యువత, ప్రజలను అపోహలకు గురిచేసే అనవసరమైన ప్రశ్నలు అడగవద్దని స్పష్టంచేశారు.

స్కిల్ సెన్సస్ సర్వే అంతిమ లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమేనని, ఆ దిశగా నైపుణ్య గణన జరగాలని అన్నారు.
పరిశ్రమలు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన.

ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధమైన తర్వాత మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.

స్కిల్ సెన్సస్ కోసం రూపొందించిన యాప్ లో పొందుపర్చిన అంశాలను అధికారులు వివరించారు. యాప్ లో పలు మార్పులు చెయ్యాలని లోకేష్ అధికారులకు సూచించారు.

Related posts