telugu navyamedia
తెలంగాణ వార్తలు

బండి పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు పట్టలేదు: కేటీఆర్

తెలంగాణ బీజేపీ చీఫ్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ ఒక్కసారి రాయచూర్ వెళ్లిచూడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయా లేదో కనుక్కోవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో కాంట్రాక్టర్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన కర్మ టీఆర్ఎస్ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. పాలమూరుకు, రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఏం చేసిందని.. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం పాలమూరుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు.  దమ్ముంటే దేశమంతా ఉచిత విద్య, వైద్యం ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఇవ్వమను అని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులు రద్దు చేయమను మేము మద్దతు ఇస్తామ‌ని అన్నారు.

డొల్లమాటలు, సొల్లు పురాణం కట్టిపెట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేత మానిక్కం ఠాగూర్‌ను పొత్తు కావాలని ఎవరు అడిగారు’’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాగా..బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండో దశ పాదయాత్ర లో బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులకు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగి కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

Related posts