telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి న‌ర్సంపేట‌లో కొత్త‌ చ‌రిత్ర సృష్టించారు..

*వ‌రంగ‌ల్ జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌..
*ప్ర‌ధాని మోదీ వ‌ల్ల ఈవెళ గ్యాస్ సిలిండ‌ర్ వెయ్యి దాటింది..
*న‌ర్సంపేట‌లో మ‌హిళా దినోత్స‌వ ముగింపు వేడుక‌లు
*ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి న‌ర్సంపేట‌లో కొత్త‌ చ‌రిత్ర సృష్టించారు..
*ఏ నియోజ‌క‌వ‌ర్గంలో లేని విధంగా ఎమ్మెల్యే కొత్త ప‌థకం తీసుకొచ్చారు.

ప్రధాని మోదీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. ఇవాళ ఆయ‌న వ‌ల్లే గ్యాస్‌ సిలిండర్ ధర రూ. వెయ్యి దాటింద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

గ్యాస్‌ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్‌ చేశారని, పెంచిన గ్యాస్ ధరలకు ఆయ‌నకు దండం పెట్టాలన్నారు .

ఏ నియోజకవర్గాల్లో ఎక్కడాలేని విధంగా నర్సంపేటలో.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్​ అన్నారు. నర్సంపేటలో ఇంటింటికీ వంట గ్యాస్​ సరఫరాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నాడు పర్యటించిన మంత్రి కేటీఆర్​.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ..ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

ఎప్పటికప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే తపన సుదర్శన్ రెడ్డికి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. తె లంగాణలో ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించుకొంటూ బంగారు తెలంగాణ వైపునకు ముందుకు వెళ్తున్నామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవిలో విద్యుత్ కోతలుండేవన్నారు. తెలంగాణ రాష్ర్టంలొ విద్యుత్ కోతలు లేవన్నారు.రైతులకు ఉచితంగా విద్యుత్ ను ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని ఆయన చెప్పారు. రూ. 22 వేల కోట్లతో రైతు రుణ మాఫీ చేశామని కేటీఆర్ చెప్పారు. నర్సంపేట అభివృద్ది కోసం రూ. 50 కోట్లను మంజూరు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Related posts