telugu navyamedia
Uncategorized

15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు : కేటీఆర్

ktr telangana

ప్రస్తుతం తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత భారీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుంద‌ని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిప‌డ్డ ఆయ‌న‌.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ స‌ప్లై కూడా లేద‌న్నారు. ఇక‌, క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లోనూ కేంద్రానికి ముందు చూపు లేదని తప్పుబట్టారు మంత్రి కేటీఆర్.. ఆలోచించకుండా వ్యాక్సిన్‌ను విదేశాలకు ఇచ్చారని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, వ్యాక్సిన్ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు కేటీఆర్.. వ్యాక్సిన్ కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాల‌కు మ‌రో రేటు నిర్ణ‌యించిన‌ప్పుడు తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts