telugu navyamedia
తెలంగాణ వార్తలు

బ్రేకింగ్​ న్యూస్​: తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి గాయం.. 3 వారాల విశ్రాంతి..

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. ఇవాళ ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు చీలమండ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో మంత్రి కేటీఆర్ కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని మంత్రి స్వయంగా తన ట్విట్టర్​ ఖాతా ద్వాారా వెల్లడించారు.

ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీ షో గురించి ఎవరైనా సలహా ఇవ్వండి” అని కేటీఆర్ తెలిపారు. కాలికి కట్టుతో ఉన్న ఫొటోను కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు.

కాగా జులై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ వేడుకలను ఆయన జరుపుకోవడంలేదని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అయితే తన పుట్టిన రోజు వేడుకలకు బదులుగా స్థానికంగా ఉన్న ప్రజలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Related posts