telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏ దేవుడు చెప్పాడు.. నా పేరు మీద కొట్టుకోమ‌ని – కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ విమ‌ర్శ‌లు.

*కేంద్రంపై కేటీఆర్ విమ‌ర్శ‌లు..
*ఏ దేవుడు చెప్పాడు.. నా పేరు మీద కొట్టుకోమ‌ని..
*ప్ర‌జాస‌మ‌స్య‌ల‌నుంచి దృష్టిమ‌ర‌ల్చేందుకు మతకల్లోలాలు 

అంబేడ్కర్‌ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  పేదల పొట్ట నింపేందుకు ఇస్తున్న ఉచిత పథకాలను ఫ్రీ బీ అంటూ బీజేపీ నేతలు అవమానిస్తున్నారని మండిపడ్డారు.

నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే…వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్శిటీలో ఇవాళ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడారు… గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపైన చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని వ్యాఖ్యానించారు.

పేద ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీపడాలని మత ఘర్షణలు సృష్టించడంలో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం కాని విష‌యం ఏంటంటే.. ’ నా పేరు మీద కొట్టుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు. మతం పేరుతో.. దేవుడి పేరుతో.. కొట్లాటలు చేయమని ఎవరు చెప్పారు అని ప్ర‌శ్నించారు.

కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? నా మ‌న‌షుల‌ను పంపిస్తున్న భూమి మీద‌కు.. ఒక‌రికొక‌రు త‌న్నుకు చావండి.. ఎవ‌రి దేవుడు గొప్ప‌ అనే కాంపిటీష‌న్ పెట్టుకొని త‌న్నుకు చావండి అని చెప్పిండా? అంటూ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

Related posts