ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జనసేన అధినేత పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల గురించి రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవనే.. అని మంత్రి మండిపడ్డారు.
రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు అడిగితే జగన్ సమాధానం చెప్పాలా? అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తిరుమల వెంకన్న ప్రసాదం తింటారో లేదో అని పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కులం, మతం గురించి చెప్పాల్సిన అవసరం జగన్‌కు ఏంటి?. తిరుమల ఆలయంలో జగన్ సంతకం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.