telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కోవిడ్ పరిస్థితుల్లో రైతులకు నష్టం రాకుడదని సీఎం ఆదేశించారు : కన్నబాబు

Ycp Kannababu

కోవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, విజయోగదారుల పై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపిన కన్నబాబు రాయితీపై విత్తనాలు పంపిణి కార్యక్రమం, రబి 2020-21 పంట ఉత్పత్తి కొనుగోలు అంశాల పై దిశానిర్దేశం చేసారు. కోవిడ్ పరిస్థితుల్లో రైతులకు ఎటువంటి నష్టం రాకుడదని సీఎం ఆదేశించారు. వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలి. విత్తనాల సరఫరాకు ఎటువంటి రవాణా ఆటంకాలు తలేత్తకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యావసర వస్తువులు రవాణాకు కూడా తగిన అనుమతులు కల్పించాలి. రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలు కూడా సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి. కోవిడ్ వల్ల రైతు ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలి అని తెలిపారు. ఈ సమీక్ష లో స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts