సూర్యపేట అభివృద్ధి పై చర్చకు సిద్ధమా ఉత్తమ్ కు మంత్రి సవాల్ విసిరారు. 20 ఏండ్లుగా శాసనసభ్యుడిగా, మంత్రిగా కేంద్ర, రాష్ట్రాలలో అధికారం లో ఉండి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఉత్తమ్, రేవంత్‌ల అరాచకాలు ప్రజలు ఎప్పటికి మరచిపోరని మంత్రి జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్‌నగర్ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారు. ఉత్తమ్ పద్మావతికి టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్ ని ప్రచారానికి దింపి ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నాడు
.50 లక్షల రూపాయాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది రేవంత్ రెడ్డి అయితే, ముడుకోట్ల రూపాయలు కారులో తగుల బెట్టుకుంది ఉత్తమ్ అని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం తెలువదనే కోదాడ ప్రజలు ఇంటికి పంపారు. రేపటి ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నాగబాబు కామెంట్స్ పై స్పందించిన పవన్