లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవనం ఇబ్బందిగా మారిందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్‌లో ముస్లిం మహిళలకు రంజాన్ పండుగ కానుకలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకి మందు రావడానికి ఇంకా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాలించాలని హరీష్ రావు సూచించారు.
సిద్దిపేట అర్బన్ మండలంలోని 305 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిజమైన రైతు రాజ్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చాక మొదటిసారి పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. రైతులు పెద్ద మనసుతో సహకరించి కాలువల భూ సేకరణకు సహకరించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.