*ఏపీ ఇలా అవడానికి కారణం కాంగ్రెస్ టీడీపీ..
*వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు..
*రాజకీయ, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేని వ్యక్తి పవన్
*లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ భార్యలు వున్న వ్యక్తి పవన్..
పవన్ కళ్యాణ్ రాజకీయ, వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ లేని వాడు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ భార్యలు వున్న వ్యక్తి పవన్.. సీఎం జగన్‌ని విమర్శించడం దారుణమని అన్నారు.
చంద్రబాబు డైరెక్షన్లో మూడు నెలలుగా బ్రహ్మాండమైన సినిమా నడుపుతున్నారు…. అది అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం అన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అమర్నాథ్.
ప్రతీ కౌలు రైతుకు పరిహారం సీఎం జగన్ అందిస్తున్నారు. రైతులను మోసగించిన చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ ప్రభుత్వాన్ని పవన్ విమర్శిస్తున్నారు. రైతులను మోసం చేసింది చంద్రబాబు అనేది దత్తపుత్రుడు తెలుసుకోవాలని అన్నారు.
2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుసరించిన మోసపూరిత హామీలే కౌలు రైతుల ఆత్మహత్యలకు మూలం. టీడీపీ హయాంలో కౌలురైతుల ఆత్మహత్యల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
అక్రమంగా పెట్టిన కేసుల్లో 16నెలలు జైల్లో ఉంటే నేరగాళ్లు అనడానికి పవన్ కళ్యాణ్ కు హక్కు ఎక్కడుందని అన్నారు. అతితక్కువ కాలంలో ఎక్కువ పొత్తులు పెట్టుకున్న రాజకీయ పార్టీగా జనసేనది వరల్డ్ రికార్డ్ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.
ఎక్కడా జగన్ కేసులపై శిక్షలు పడలేదు. అప్పటి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి చేసిన కుట్ర అని ప్రజలకు తెలుసు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలు తెలిసే 2019లో జనం ఓడించారని అన్నారు.