telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది : ఈటల

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం కరోనా నుంచి తొందరగా కోలుకుంటుందని పేర్కొన్నారు. కరోనా బాధితుల చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి ఈటల.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తుంటే…ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. ఆరోగ్య శ్రీ కింద వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు జేబుల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయకుండా వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని 104,108, ఈఎస్‌ఐ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు మంత్రి ఈటల.

Related posts