వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, మంత్రి వెలంపల్లి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అంకిత భావం, సేవా భావంతో ప్రజలకు సేవ చేస్తున్నారంటూ ప్రశంసలు కుపించారు. వైఎస్ ఆశయాలు సహా నమ్మిన సిద్ధాంతాల కోసం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమపథకాలను అందిస్తున్నామన్న ఆయన.. 8 పేజీల మేనిఫెస్టోను రూపొందించి 20 నెలలకాలంలో నూటికి నూరు శాతం అమలు చేశామని వెల్లడించారు. మరోవైపు ప్రజల కోసం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 80 శాతం గెలవడమే ప్రజల మద్దతుకు నిదర్శనమన్న బొత్స.. నూటికి నూరు శాతం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు వైసీపీ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ నెల 15 న రానున్న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది.
previous post
next post