telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్షరాస్యతలో ఏపీని మొదటి స్థానంలో నిలుపుతాం: మంత్రి అవంతి

ఏపీ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల బోధన ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పై ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు మీడియం విద్యపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఇంగ్లీషు మీడియం పై రాజకీయం చేయడం సరికాదని ప్రతిపక్షాలపై మంత్రి మండిపడ్డారు.

పేద పిల్లల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, అక్షరాస్యతలో ఏపీని మొదటిస్థానంలో నిలుపుతామని అన్నారు. ఇంగ్లీషు మీడియం అమలు చేయాలన్న నిర్ణయంతో సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.

Related posts