telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో రేపట్నుంచి యధావిధిగా స్కూల్స్, కాలేజీలు..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులను పొడిగించే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. రేపట్నుంచి ఏపీలో యధావిధిగా స్కూల్స్, కాలేజీలు తెరుచుకోనున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ తరహాలో ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ ఈ వార్తలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే ప్రభుత్వానికి లేదని .. భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామనిఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గుంటూరు జిల్లా కాకుమానులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు విషయంపై పై విధంగా స్పందించారు..

Related posts