తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం పై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమించారని మంత్రి కొనియాడారు. కేసీఆర్ మదిలో పుట్టిన అద్భుత ఆవిష్కరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమపై అర్థం లేని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.
టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా భయపడవద్దు: స్పీకర్ తమ్మినేని