telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

పురగుల అన్నం తినలేమని కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన

ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లో అవి పక్కదారి పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. ఈ క్రమంలో పురగుల అన్నం తినలేమని కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో పురగుల అన్నం, నాసికరం కూరగాయలతో కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు.

నేటి మధ్యాహ్నం వారు తినే అన్నంలో పురుగులు కనిపించడంతో, మధ్యాహ్న భోజన సిబ్బందిని నిలదీశారు. కానీ వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరి ఆందోళన గురించి తెలుకున్న కలెక్టర్ దివ్య విద్యార్థినుల వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే జిల్లా విద్యాశాఖాధికారిని విచారణకు ఆదేశించారు.

Related posts