telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత సెలెక్టర్లపై మైకేల్‌ వాన్ ఆగ్రహం…

టీంఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్ ‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌. ఐదు టీ20ల సిరీస్‌కు సంబంధించి టీమిండియా మూడో టీ20లో ఓడిపోవడానికి బ్యాటింగ్‌ ఆర్డరే ప్రధాన ‌కారణమని తెలిపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేదంటూ ‌టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డాడు. టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తేలిపోతోంది. ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో ఆడుతున్నామనే విషయం గుర్తుంచుకోవాలి. మొదటి మ్యాచ్‌లో ఓటమి అనంతరం రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఫుంజుకున్నట్లుగా అనిపించినా.. తర్వాతి మ్యాచ్‌కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేకపోవడయే… రెండో టీ20లో ఓపెనింగ్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ఆడాడు. మూడో టీ20కి రోహిత్‌ శర్మ తుది జట్టులోకి తిరిగి రావడంతో ఇషాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. రోహిత్‌ శర్మను ఓపెనింగ్‌లో ఆడించినా.. అతనికి జతగా ఇషాన్‌ పంపిస్తే బాగుండు. అప్పడు లోకేష్ రాహుల్‌ మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అని అన్నాడు.

Related posts