మేరి కోమ్ మేజర్ టైటిల్‌పై గురి పెట్టింది. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా ఉన్న మేరీ..ఏడో టైటిల్‌పై గురి పెట్టింది. మెగా టోర్నీలో స్వర్ణం కొల్లగొట్టేందుకు రెడీ అయిపోయింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో 36 ఏళ్ల మేరీ ఫెవరేట్‌గా పోటీ పడుతోంది. అక్టోబర్ 03వ తేదీ గురువారం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. 51 కిలోల విభాగంలో బరిలో దిగుతోంది. మూడో సీడ్ మేరీ తొలి రౌండ్లో బై లభించడంతో..నేరుగా ప్రీ క్వార్టర్ ఫైనల్ బౌట్ ఆడనుంది. అక్టోబర్ 08వ తేదీన ఆ బౌట్ జరుగనుంది. గత సంవత్సరం 48 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన మేరీ..ఈసారి మెగా ఈవెంట్‌లో తొలిసారిగా 51 కిలోల నుంచి పోటీ పడుతుండడంతో ఆసక్తి నెలకొంది.
ఈ ఈవెంట్ లో భారత్ నుంచి మొత్తం పది మంది బరిలో ఉన్నారు. వీరిలో ఐదుగురికి తొలి రౌండ్లో బై లభించింది. 60 కిలోల విభాగంలో సరిత దేవీ తలపడుతోంది. ట్రయల్స్‌లో గత టోర్నీలో కాంస్యం నెగ్గిన సిమ్రన్ జిత్‌ను ఓడించి మెగా టోర్నీకి ఎంపికైంది. మంజూ రాణి 48 కిలోలు, జమునా బోరో 54 కిలోలు, నీరజ్ 57 కిలోలు, మంజూ బొంబోరియా 64 కిలోలు, లవ్లీనా బొర్గోన్ ఈసారి 69 కిలోల విభాగానికి మారింది. సవీటి బూర 75 కిలోలు, నందిని 81 కిలోలు, కవితా చాహల్ +81 బరిలో నిలిచారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణ స్కూళ్లలో అధిక ఫీజులు: లక్ష్మణ్