telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిహారిక స్థానంలో మేఘాఆకాశ్ ?

Megha Akash

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారికకు మెగాస్టార్ అభిమానులే కాకుండా ప్రత్యేకమైన అభిమానులున్నారు. టీవీ షోలలో తనదైన ముద్రతో ఒక ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు నిహారిక. నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య జొన్నల‌గ‌డ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇటీవలే నీహారిక వివాహ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలో నిహారిక ఓ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళంలో త్వరలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో కొణిదెల నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ ను రీప్లేస్ చేశారు. స్వాతిని దర్శకత్వంలో అశోక్ సెల్వన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హీరోయిన్ గా నిహారికను తొలుత ఎంపిక చేశారు. పెళ్ళి నేపథ్యంలో సదరు చిత్రంలో నటించలేనని చిత్ర నిర్మాతకు నిహారిక తెలిపింది. దీంతో ఆమె స్థానంలో మేఘా ఆకాశ్ ను ఎంపిక చేశారు. మొదటి సినిమా “ఒక మనసు” పరవాలేదనిపంచినా ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. నిహారిక తాజాగా చిరంజీవి ‘సైరా’ సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే

Related posts