telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ప్లాస్మా దానం చేయమని ట్విట్టర్ వేదికగా కోరిన చిరు..

chiranjeevi

కరోనా సమయంలో మెగాస్టార్ చిరంజీవి అందరికి సహాయం చేసిన విషయం తెలిసిందే. అయితే మాములుగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు ప్లాస్మా డొనేషన్ పై దృష్టి పెట్టింది. చిరంజీవి అభిమానులు, సాధారణ ప్రజానీకం నుండి రక్తనిధి సేకరణ చేస్తోంది. కరోనా కారణంగా గత యేడాది చాలా బ్లడ్ బ్యాంక్స్ లో రక్తనిధి కొరత ఏర్పడింది. దాంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సైతం దానిపై దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, రక్త దానంపై అవగాహన కల్పించింది. అయితే… ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరింతగా జన జీవితం అతలాకుతలం కావడంతో స్వయంగా చిరంజీవి ప్లాస్మా దానం చేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. కొవిడ్ నుండి ఇటీవల కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేస్తే… మరో నలుగురికి జీవితాన్ని ప్రసాదించిన వారవుతారని, కాబట్టి ప్లాస్మా దానం చేయమని ఆయన ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు. చూడాలి మరి దీనికి అభిమానులు ఎంతలా స్పందిస్తారు అనేది.

Related posts