telugu navyamedia
తెలంగాణ వార్తలు

మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం : గ‌ద్దె మీద కొలువు దీరిన సారాల‌మ్మ‌

మేడారంలో వైభవంగా రెండో రోజు సమ్మక్క-సారలమ్మ మహా జాతర గురువారం ఘనంగా జరుగుతుంది.. మేడారం మహాజాతరలో రెండోరోజు మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

కోరిన కోరికలు తీర్చే వన దేవత చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క కుంకుమ భరిణె రూపంలో వచ్చి గద్దెపై కొలువుదీరింది. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, ప్రభుత్వ లాంఛనాలతో.. పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి తీసుకువచ్చారు. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతారు.

కన్నెపల్లి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Related posts