telugu navyamedia
రాజకీయ వార్తలు

రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు: మాయావ‌తి

mayawati

రిజ‌ర్వేష‌న్లు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అని బీఎస్పీ నేత మాయావ‌తి అన్నారు. ఆ హ‌క్కుల్ని కాల‌రాయ‌డం అన్యాయ‌మ‌వుతుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్ల వ్య‌తిరేక స్వ‌భావాన్ని ఆర్ఎస్ఎస్ విడ‌నాడాల‌ని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. రిజ‌ర్వేష‌న్లు ఉండాలా వ‌ద్దా అన్న అంశంపై సానుకూలంగా చ‌ర్చించుకోవాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఇటీవ‌ల అన్నారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌ను మాయవతి ఖండించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై చ‌ర్చించాల‌ని ఆర్ఎస్ఎస్ అంటోందని, ఇందులో ఏదో ఆంతర్యముందన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రిజ‌ర్వేష‌న్ల పై అవ‌స‌రం లేద‌ని మాయావ‌తి పేర్కొన్నారు.

Related posts