massive fire accident in mumbai fort

ముంబై పోర్ట్ లో భారీ అగ్నిప్రమాదం

24

ముంబై ఫోర్ట్ ప్రాంతంలో ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం పటేల్ చాంబర్స్ లో జరిగినట్టు తెలుస్తుంది.

ఘటన గురించి సమాచారం అందటంతో అగ్నిమాపకదళం రంగంలోకి దిగింది. దాదాపు 16 ఫైర్ ఇంజిన్స్ మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఘటనలో అగ్నికి ఆహుతిఅయిన భవనం కూలిపోవటంతో అక్కడే ఉన్న ఫైర్ ఇంజిన్స్ రెండు ధ్వంసం అయ్యాయి.

భవనం కూలిపోవడంతో సహాయక చర్యలకు, మంటలు ఆర్పటానికి సమయం పడుతుందని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి కొద్దిపాటి గాయాలయ్యాయని, మిగిలిన వారు బాగానే ఉన్నారని వారు చెప్పారు.

మంటలు బాగా విస్తరించటంతో 16 ఫైర్ ఇంజిన్స్ తోపాటు 11 ట్యాంకర్లు, మరియు 150 మంది ఫైర్ సిబ్బంది నిరవధికంగా శ్రమిస్తున్నారని ఆ అధికారి తెలిపారు.

ప్రమాదానికి గల కారణాన్ని విచారిస్తున్నారు, ప్రమాద సమయంలో సదరు భవనం ఖాళీగా ఉండటంతో ఎవరికి ఏమి కాలేదని అధికారులు వెల్లడించారు.

ఫోర్ట్ ప్రాంతంలో భారీగా జరిగిన అగ్ని ప్రమాదాలలో గత పది రోజులలో ఇది రెండవది. గతంలో ఇక్కడే ఒక ఆదాయపు పన్ను శాఖ అధికారి ఇంట్లో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో కూడా అందరిని రక్షించారు ఫైర్ సిబ్బంది.