పెంచారు. అయితే, మాస్కులు,శానిటైజర్లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటి ధరలను కూడా అదుపులోకి తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, శానిటైజర్లకు ధరలు నిర్దేశించామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.
నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీకి ముందు ఉన్న మాస్కుల ధరలనే కొనసాగిస్తామన్నారు. సర్జికల్ మాస్కు (టు, త్రీ ప్లై రకం) రిటైల్ ధర రూ. 8 అని, దాన్ని పది రూపాయలకంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అలాగే, 200 ఎమ్.ఎల్. హాండ్ శానిటైజర్ బాటిల్ ధర రూ. 100 దాటకూడదని తెలిపారు.