telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు పాట పాడడం కష్టం : ఏఆర్ రెహ్మాన్

AR-Rahman

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం “అవెంజర్స్ : ఎండ్ గేమ్” ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆంథెమ్‌ని సమకూర్చారు. “ఆగేది లేదు ఎదురే అడ్దేమున్నా…” అంటూ సాగిన ఈ పాటని రాకేందు మౌళి రచించారు. ఈ పాటను స్వయంగా ఏఆర్ రెహ్మాన్ ఆలపించారు. ఈ పాటతో పాటు సినిమా తెలుగు ట్రైలర్ ను కూడా సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రెహ్మాన్ తో పాటు సినిమాలో కీలకపాత్ర థానోస్ కి తెలుగు డబ్బింగ్ చెప్పిన హీరో రానా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ ఈ సినిమాలో తెలుగు పాటని తనే పాడాల్సి వచ్చిందని, తెలుగు పాట పాడడం చాలా కష్టమని, మొదట భయపడినా… ఆ తరువాత అర్ధం చేసుకొని పాడానని వెల్లడించారు. దర్శకుడు పాట విన్న తరువాత కొరియన్, చైనీస్ భాషల్లో కూడా డబ్ చేయమని అన్నారని, తనకు నచ్చిన సూపర్ హీరో బ్లాక్ పాంథర్ అని తెలిపారు. ప్రస్తుతం అతడు మణిరత్నం సినిమాకు సంగీతం సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. .

Related posts