telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఉద్యోగులకు మారుతీ సుజుకి షాక్ .. 3,000 మంది ఉద్యోగులపై వేటు!

Maruti-Suzuki symbol

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఉద్యోగులకు షాకిచ్చింది. అంతర్జాతీయ  మార్కెట్లలో అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడంపై కంపెనీ దృష్టి సారించింది. మారుతీ సుజుకి సంస్థ తాజాగా 3,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు వేసింది. ఈ తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించేందుకు కంపెనీ ఆసక్తి చూపలేదు.

ఈ విషయాన్ని కంపెనీ చైర్మన్ ఆర్ సీ భార్గవ ధ్రువీకరించారు.ఇది వ్యాపారంలో ఒక భాగమే. మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగినప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటాం. డిమాండ్‌ తగ్గితే ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తామన్నారు. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో 3,000 మంది తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యూవల్‌ చేయడంలేదన్నారు. అయితే శాశ్వత ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించడం లేదని భార్గవ స్పష్టం చేశారు.

 

Related posts