telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ఛత్తీస్ గఢ్ లో రెచ్చిపోయిన మావోలు..25 మంది గ్రామస్తుల అపహరణ

Naksals attack

మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేసేందుకు పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇటీవల వారి కదదలికలు పెరిగిన నేపథ్యంలో వారికోసం ప్రత్యేక సాయుధ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. 

ఇటీవలే 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు. ఆ తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి నలుగురి గొంతులు కోసి హతమార్చారు. అనంతరం ఐదుగురిని విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉన్న మిగతా 16 మందిని ఈరోజు హత్య చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Related posts