“నా అణువణువులో ప్రణతి ” మనోజ్

33

పుకారులు చాలా సస్పీడుగా షికారు చేస్తుంటాయి . రాయకీయ రంగం , సినిమా రంగంలో ఏదైనా చిన్న ఘటన జరిగితే చాలు దానికి చిలవలు పలవలుగా మసిపూసి , మరికొంత కల్పించి సోషల్ నెటవర్క్ లో పెట్టేస్తుంటారు . అదో తుత్తి , అదో వెర్రి ఆనందం . సినిమా రంగంలో చిన్న ఆర్టిస్టు అయినా పుకారు విషయంలో పెద్ద పుబ్లిసిటీయే లభిస్తుంది . ఇది ఆనవాయితీ . ఇక పెద్ద ఆర్టిస్టు అయితే చెప్పనవసరం లేదు .
ఈ మధ్య మంచు మనోజ్ విషయంలో ఇదే జరిగింది . మోహన్ బాబు రెండవ కుమారుడు మనోజ్ . విష్ణు, లక్ష్మికి సోదరుడు . మనోజ్ హీరోగా అందరికీ సుపరిచితుడే . 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు . అయితే వీరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని , ప్రస్తుతం ప్రణతి అమెరికా వెళ్లిందని ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ హలచల్ అయ్యింది . పెళ్ళయ్యి అప్పుడే మూడు సంవత్సరాలు కూడా కాలేదు అప్పుడే విడిపోతున్నారటరోయ్ అంటూ వ్యాఖ్యానాలు ,పెదవి విరుపులు. దీనిపై మనోజ్ పెద్దగా నవ్వేశాడు .
“ప్రణతి నా ప్రాణం , మేము ఇష్టపడి పెళ్లిచేసుకున్నాం , ఆమె ఆ అణువణువు లో వుంది ” అని చెప్పేశాడు .
మనోజ్ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు . సినిమా రంగంలో ఇవ్వన్నీ కామనే అన్నట్టు ఓ నవ్వు నవ్వాడు .