ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరిగింది.
“ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయి గుర్తింపులేని కులాలపైనే విస్తృతంగా చర్చలు జరిపారు ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశాము.
ఎస్సీ వర్గీకరణ ఈస్థాయికి వచ్చిందంటే మందకృష్ణ, చంద్రబాబు ఇద్దరే కారణం”. మాదిగ కులానికి వన్నె తెచ్చిన మందకృష్ణకు అభినందనలు అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు ఎస్సీ వర్గీకరణ అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.