telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ లో కొన‌సాగుతున్న ర‌చ్చ‌..

మా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో కొత్త చర్చకు దారి తీసింది. అయితే ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం ‘మా’ నూతన అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలనే ఆసక్తితో ఉన్న విష్ణు ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విష్ణు తన తొలి సంతకాన్ని పెన్షన్‌ ఫైల్‌పై చేశారు.

ఇదిలా ఉంటే.. న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణను ఈ రోజు (అక్టోబర్​ 15) ఉదయం మంచు విష్ణు తన తండ్రి మోహన్‌బాబుతో తొలిసారి కలిశారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి ప‌లు అంశాలుతో పాటు ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ల్‌ రాజీనామాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందించారో తెలియాల్సి ఉంది.

Manchu Vishnu shares Balakrishna's powerful message

భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. గత సాధారణ ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య బాబు అల్లుడు లోకేశ్ కు ఓడించడానికి నేను ప్ర‌చారం చేశాను..అప్పుడు అక్క‌డ వైకాపా విజ‌యం సాధించింది. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి.. గెలిపించారు “బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. అన్నయ్య యన్‌.టి.రామారావు గారే అక్క‌డ నా త‌మ్ముడున్నాడు వెళ్ళు అని బాలయ్యను పంపించినట్లు ఉంది. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు” అని తెలిపారు.

What's Up? Mohan Babu To Meet Balayya! -

విష్ణు మాట్లాడుతూ.. తాను త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవిని కలవనున్నట్లు చెప్పారు. “ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, పరుచూరి సోదరులను కలిశాను. త్వరలోనే చిరంజీవిని కూడా కలుస్తాను. ఈ ఎన్నికల్లో బాలయ్య నాకు మొదటి నుంచి ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆశీర్వాదం తీసుకోవడానికే ఈరోజు ఆయన ఇంటికి వచ్చాను. పెద్దలందర్నీ కలుపుకుని ముందుకు వెళ్తాను” అని వివరించారు.

Manchu Vishnu gets Balakrishna's support - TeluguBulletin.com

ఇదిలా ఉంటే.. మా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన వారంద‌రి క‌లిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ‘మా’లో నెలకొని ఉన్న పరిస్థితుల రీత్యా బాలయ్యతో భేటీ కావ‌డం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Related posts