telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

పబ్‌జి ఆడొద్దన్నాడని.. అన్ననే కడతేర్చిన తమ్ముడు.. క్యా గేమ్ రే!!

hyderabadi school student died on pubg

పబ్‌జి కి బానిసలు అవుతున్నారనేది మరోసారి నిరూపణ అయ్యింది, ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఓ బాలుడు తన సొంత అన్ననే దారుణంగా చంపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీవండికి చెందిన ఓ బాలుడు (15) నిన్న ఉదయం తన అన్న మహమ్మద్ షేక్ (19) స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జి మొబైల్ గేమ్ ఆడుతున్నాడు.

ఆ గేమ్ ఆడొద్దని షేక్ తన తమ్మున్ని వారించాడు. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు తన అన్న తలను గోడకు కొట్టి.. అనంతరం అతన్ని పక్కనే ఉన్న కత్తెరతో దారుణంగా పొడిచాడు. ఈ క్రమంలో బాధితున్ని హాస్పిటల్‌కు తరలించగా.. అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts