telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఏఏలను వ్యతిరేకిస్తూ..మమతా మెగా ర్యాలీ

mamatha benerji

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కోల్‌కతాలో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆమె ఈ రోజు ట్వీట్ చేశారు.

‘రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కదలి రండి. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై కోల్ కతాలో మెగార్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం రెడ్ రోడ్ లోని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై జోరాసంకో ఠాకుర్బారీ వద్ద ముగుస్తుంది’ అని మమతా ట్వీట్లు చేశారు.

Related posts