మలేషియా అధికారులు భారీ మొత్తంలో ఏనుగుల దంతాలను కాల్చివేశారు. 3.2 మిలియన్ డాలర్లు(రూ.22 కోట్ల 26 లక్షలు) విలువ చేసే ఏనుగు దంతాలను భస్మం చేసినట్లు మలేషియా అధికారులు తెలియజేశారు. ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా భారీ స్థాయిలో ఏనుగు దంతాల అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. ఏనుగు దంతాలను చైనా, వియత్నాం వంటి మేజర్ అంతర్జాతీయ మార్కెట్‌లకు రవాణా చేస్తుంటారు. ఈ రవాణాకు అంతం పలికేందుకు, స్వాధీనం చేసుకున్న దంతాలను కాజేసి మరెవరు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకుండా ఉండేందుకే తాము టన్నుల కొద్దీ ఏనుగు దంతాలను కాల్చివేసినట్టు అధికారులు తెలిపారు. 2011 నుంచి 2017 వరకు 15 సార్లు రైడ్ చేయడం ద్వారా ఈ దంతాలను తాము స్వాధీనం చేసుకున్నామన్నారు.
previous post