telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు : పక్కా మాస్‌ అవతారంలో మహేష్… వీడియో లీక్

SN

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “స‌రిలేరు నీకెవ్వ‌రు”. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత “స‌రిలేరు” నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో శ్రీమణి సాహిత్యం అందించిన “హీ ఈజ్‌ సో క్యూట్‌” పాటను సోమవారం విడుదల చేశారు.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రతీ సోమవారం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయ్యింది. మహేష్ బాబు రష్మికలపై ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటను ముందుగా రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో మహేష్‌ పక్కా మాస్‌ అవతారంలో కనిపిస్తాడని ఆ లుక్‌లో బిగ్‌ స్క్రీన్‌ మీద ఆడియన్స్‌ చూడాలన్న ఉద్దేశంతో లిరికల్ వీడియోలోనూ మహేష్‌ స్టిల్స్‌ను రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన వీడియోనే ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. గళ్ల లుంగీతో డ్యాన్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మహేష్ అభిమానులే ఈ వీడియోనే తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో చిత్రయూనిట్ మహేష్‌కు సంబంధించి ఏ లుక్‌ అయితే దాచి పెట్టాలనుకున్నారో అదే ఇప్పుడు రివీల్‌ అవ్వటంతో అంతా తలపట్టుకున్నారు. ఈ విషయంపై మహేష్‌ కూడా సీరియస్‌ అయినట్టుగా తెలుస్తోంది.

Related posts