telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యామిలీతో సరదగా గడుపుతున్న మహేష్ బాబు…

Mahesh

కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఐతే మహామ్మారి ఇంకా విజృంభిస్తూ ఉండటంతో కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. అత్యవసర సేవలు మినహా అన్ని ఎక్కడిక్కడ స్థంభించిపోయాయి. దీంతో హీరోలు సినిమా షూటింగ్స్ లేక ఇంట్లో ఉంటున్నారు. ఒక్కొక్కరు ఇంట్లో తాము ఏమి చేస్తున్నామో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా హీరో మహేష్ బాబు ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఇంట్లో తనకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు కొన్ని పుస్తకాలను కూడా చదువుతున్నట్టు చెప్పుకొచ్చాడు. తాజాగా ఇంట్లో పిల్లలతో సరదగా గడుపుతున్నాడు. ఇపుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts