telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో కొత్త బిజినెస్ మొదలుపెట్టనున్న మహేశ్ బాబు

Mahesh-Babu

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్ని కూడా విస్తరించేసుకుంటున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ప్రవేశించి రాణిస్తున్నటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ తాజాగా మరో వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. తాజాగా ఆయన డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యాపారంలోకి కూడా దిగబోతున్నారని సమాచారం. ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీ మీడియా సర్వీసెస్ వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సైతం ‘ఆహా’ అనే పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ఇక ఇప్పుడు మహేశ్ సైతం అదే రంగంలోకి దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. హీరో మహేశ్ బాబు, ఇప్పటికే సినిమా థియేటర్స్, టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts