telugu navyamedia
Uncategorized

మాటల మాంత్రికుడుకి మహేష్ రిక్వెస్ట్..

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే డైరెక్టర్ త్రివిక్రమ్ . ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేసాడు. ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని త్రివిక్రమ్ అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా  సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. రశురామ్ తో సర్కారు వారి పాట.. త్రివిక్రమ్ తో మరో చిత్రం ఒకేసారి షూట్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు త్రివిక్రమ్ కు మహేశ్ ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. పరశురాం సినిమాతోపాటే త్రివిక్రమ్ ను కూడా సినిమా షెడ్యూల్ ను మొదలుపెట్టి కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేయాలని కోరాడట. మరి ఈ వార్త నిజమోకాదో తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పరుణుల విషయంలో బిజీగా ఉన్నాడు.

Related posts