telugu navyamedia
రాజకీయ వార్తలు

సుప్రీంకోర్టుకు “మహా” రాజకీయం..పిటిషన్ దాఖలు చేసిన శివసేన!

Supreme Court

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్ తక్కువ సమయాన్ని ఇచ్చారంటూ పిటిషన్ వేసింది.

బీజేపీకి 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని, తమకు మాత్రం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని తెలిపింది. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహారశైలి ఉందని ఆరోపించింది. ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు గవర్నర్ తెలిపారు. దీంతో, గందరగోళానికి గురైన శివసేన, ఎన్సీపీలు గవర్నర్ ప్రకటనపై మండిపడుతున్నాయి.

Related posts