mahaghat bandhan makes rahul as pm

మహాఘట బంధన్ రాహుల్ ని ప్రధాని గా చేస్తుందా ?

19

రాహులు గాంధీ ప్రధాని కావడానికి పావులు కదుపుతున్నారు, దేశంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటిని ఒకే గూటి క్రిందకు తేబోతున్నారు. అందుకే మహాఘట బంధన్ ఏర్పరచబోతున్నారు. మహాఘట బంధన్ రాజకీయం కాదు ప్రజల నమ్మకం సెంటిమెంట్ అన్నారు, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం ఫై మానవ హక్కులపై దాడి చేస్తుందన్నారు, వాటిని ఆపవలసిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే మహాగట బంధన్ ఏర్పడనుందన్నారు. వ్యక్తిగత లక్ష్యాల కన్నా ఉమ్మడి లక్ష్యం, ఐక్యత ప్రదానం అంటున్నారు ప్రతిపక్ష నాయకులు.

ఎన్ డి ఏ నియంతృత్వపాలన సాగిస్తున్నదని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందన్నారు రాహుల్, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే మహాఘట బంధన్ ఉమ్మడి లక్ష్యం అన్నారు, అందుకోసం ఎన్ డి ఏ కు వ్యతిరేకంగా దేశంలోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకం కావలసిన తరుణం ఆసన్నమైందన్నారు. బీజేపీ ని గద్దె దించుతాం అన్నారు, మమతా అఖిలేష్, మాయావతి, దేవెగౌడ, చంద్రబాబు మొదలైనవారు మహాఘట బంధన్ లో చేరొచ్చని విశ్లేషకులు అంటున్నారు.