naa nuve

మ్యాజికల్ మూమెంట్ అఫ్ నా నువ్వే

15

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `నా నువ్వే`. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ మహేశ్ కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. జూన్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

ఈ నేపథ్యంలో “మ్యాజికల్ మూమెంట్ అఫ్ నా నువ్వే” అంటూ ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.