నెల్లూరులో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని భావించిన వంశీకృష్ణ అనే యువకుడు ఆవేశంలో పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది. తన ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారన్న నెపంతో వారిని అంతమొందించేదుకు పూనుకున్నాడు.ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజ్‌తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.