ఆదివారం వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. సౌతాఫ్రికాపై ఘన విజయం తర్వాత ఫుల్‌జోష్‌లో ఉన్న భారత జట్టు లండన్‌లో సాధన చేస్తోంది. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ నగర్ నిగమ్ అధికారులు జరిమానా విధించారు. నీటిని వృథా చేసినందుకు మున్సిపల్ అధికారులు రూ.500 ఫైన్ కూడా వేశారు.
డీఎల్‌ఎఫ్ ఫేజ్-1లో ఉన్న తన ఇంటి పనివారు కార్లను శుభ్రం చేసేందుకు లీటర్ల కొద్ది నీటిని వృథా చేస్తున్నందున ఇంటి యజమాని కోహ్లీకి చలాన్ పంపారు. తన ఇంటి ముందు పార్క్ చేసిన డజనుకు పైగా కార్లను మంచి నీటితో శుభ్రం చేయడాన్ని తన పక్కింటివారు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. కోహ్లీతో పాటు మరో 10 మందికి కూడా చలాన్లు జారీ చేసినట్లు మున్సిపల్ ఇంజినీర్ అమన్ ఫొగట్ పేర్కొన్నారు.