telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న నారా లోకేశ్

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ‘మొంథా’ తుపాను సృష్టించిన నష్టంపై కేంద్ర మంత్రులతో వారు కీలక సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ భేటీలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను కలవనున్నారు.

తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను వారు కేంద్ర మంత్రులకు అందజేయనున్నారు.

రాష్ట్రానికి అవసరమైన సహాయంపై చర్చించనున్నారు. ఈ సమావేశం కోసమే మంత్రులు లోకేశ్, అనిత నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.

విమానాశ్రయంలో వారికి టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. తుపాను నష్టం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు కోరడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం.

Related posts