తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని పక్కన పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా టీడీపీ కూడా ప్రచారం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో నారా లోకేష్… సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యతో తనకు, తన కుటుంబానికి సంబంధలేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం లేదని సీఎం జగన్ ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. సీఎం జగన్ ఒక సైకో అని ఫైర్ అయ్యారు. “సైకో రెడ్డి పాలనలో అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇవి గ్రహించాలి. వైఎస్.వివేకానంద రెడ్డి గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని ఆ వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం. ఈ నెల 14 న తిరుపతి వస్తున్న జగన్ రెడ్డి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు వివేకా గారి హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్మూ, ధైర్యం ఉందా? అని సవాల్ విసిరాను” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
previous post
రోహిత్ శర్మను ఔట్ చేయడం డ్రీం… : పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ నసీమ్ షా