telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సీజ్ చేసిన వాహనాలు ఇస్తున్న కన్నడ పోలీసులు!

lockdown vechicles

వాహనదారులకు కన్నడ సర్కారు శుభవార్త చెప్పింది. మార్చి నెలలో లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి నిబంధనల ఉల్లంఘనదారులకు సంబంధించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశార్రు. ,వాటిని నేటి నుంచి తిరిగి వెనక్కు ఇచ్చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన బెంగళూరు సీపీ భాస్కర్ రావు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించాలని నిర్ణయించామన్నారు.

ఇప్పటివరకూ 47 వేలకు పైగా వాహనాలు తమ అధీనంలో ఉన్నాయని, వాటి రికార్డులను పరిశీలించి వెనక్కు ఇస్తామని తెలిపారు. కాగా, లాక్ డౌన్ ముగిసేంత వరకూ సీజ్ కాబడిన వాహనాలను వెనక్కు ఇవ్వబోమని గతంలో పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిని కోర్టు ద్వారానే విడిపించుకోవాల్సి వుంటుందని కూడా పోలీసు వర్గాలు గతంలో వెల్లడించాయి.

Related posts