కరోనా వైరస్ కారణంగా ప్రపంచం స్తంబించిపోయింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు కోసం తప్ప ఎవరూ బయటకి రావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకీ పాజిటివ్ మరియు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. మరికొంత మంది కోవిడ్ లక్షణాలతో క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా బారిన పడిన కొందరు సినీ ప్రముఖులు ప్రాణాలు కొల్పోగా మరికొంతమంది చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో క్వారంటైన్ నుంచి ఇంటికి పయనమవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు, ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా స్టార్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాజల్ కూడా వంట గదిలోకి వెళ్లి సమోసాలు తయారు చేశారు. బాగా రావడంతో శబాష్ అనేసుకున్నారు కూడా. ‘‘తొలిసారి సమోసా చేశాను. చాలా బాగా కుదిరింది. మా అమ్మ ఆధ్వర్యంలో చాలా శుభ్రతను, క్వాలిటీని పాటిస్తూ తయారు చేశాను’’ అని పేర్కొన్నారు కాజల్.
previous post
next post
సమంత ప్రెగ్నెన్సీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్..